జనవరి 11 పయనించే సూర్యుడు, బచ్చన్నపేట జనగామ జిల్లా.
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకం ప్రారంభించిన సందర్భంగా మండల పద్మశాలి నేతన్నలు, మహిళలు ర్యాలీగా తరలి చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.మూడు కొత్త పథకాల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.నేతన్న పొదుపు నిధి,భద్రత, భరోసా ఈ మూడు పథకాలకు సంబందించిన జీవో జారీ చేసింది. గతేడాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధికి ఈ స్కీమ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో బచ్చన్నపేట పద్మశాలి సంఘం శాశ్వత గౌరవ అధ్యక్షులు మచ్చ నరేందర్, వేముల బాలరాజ్, బేతి కృష్ణమూర్తి, వేముల రాములు, శ్రీరామ్ శ్రీహరి, వల్లాల శ్రీనివాస్, వేముల సత్యం, గుర్రపు బాలరాజు గోలి బుచ్చిరాజు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్లగోని బాల కిషన్ గౌడ్, జంగిటి విద్యనాథ్,మహాత్మాచారి మరియు పద్మశాలి సంఘం మహిళలు పాల్గొన్నారు.