పయనించే సూర్యుడు జనవరి 23 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కూకట్పల్లి కెపి హెచ్ బి లో జనసేన పార్టీ ఆఫీస్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలలో ముఖ్యఅతిథిగా కూకట్పల్లి నియోజకవర్గ జనసేన కంటేస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్. నేతాజీ పటానికి మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్. వెంకటేష్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి పి వెంకటేష్ , అడ్వైజర్ మన్నె యాదగిరి ఆధ్వర్యంలో మూసాపేట్ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహమునకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యంగా చెప్పుకునే పేరుల్లో సుభాష్ చంద్రబోస్ ఒక రని తన పోరాట పట్టిన ,తెగువతొ దేశాన్ని కాపాడుకోవాలంటే అహింస ఒక్కటే మార్గం కాదు , పోరాటాలుకూడా చేయాలి అంటూ గాంధీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టి మిస్టరీగా చనిపోయిన నేతాజీ పుట్టినరోజు ఈ రోజు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, కలిగినీడి ప్రసాద్, పసుపులేటి ప్రసాద్, పోలెబోయిన శ్రీనివాస్, పాదం సూర్య, అంజి, శంకర్ రావు, పులగం సుబ్బు, పూషడపు సురేష్ ,గోపి , నీరజ్ , మణికంఠ ,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.