
పయనించే సూర్యుడు న్యూస్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని మూసాపేట్ జనతా నగర్ లోని సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నేతాజీ జయంతి వేడుకల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ,ప్రతి ఒక్కరూ నేతాజీ ఆశయాలను ఆచరణలో పెట్టి, సమాజం మరియు దేశ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.”అనంతరం జయంతి వేడుకల్లో పాల్గొన్న బీజేపీ మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులను, కార్యకర్తలను వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆత్మీయంగా కలిసి వారి సమస్యలను, అవసరాలను సాధకబాధకాలను గురించి వివరంగా తెలుసుకొని సత్సంగం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ హితానికి, దేశాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
