
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్
-- బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్. ఈరోజు గురువారం రోజున మోర్తాడ్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.గత రెండు రోజులుగా తనపై జిఎస్టి విచారణ సందర్భంగా తనకు అండగా నిలిచిన బాల్కొండ నియోజకవర్గం ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.కొంతమంది జీఎస్టీ అధికారులు అత్యుత్సాహం వల్లే తన సంస్థ పై విచారణ జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో 12 శాతం మరియు మిగతా రాష్ట్రాలలో ఐదు శాతం జీఎస్టీని బస్సుల మీద యధావిధిగా కట్టేవారమని కానీ మొత్తం మీద 12 శాతం జీఎస్టీ కట్టాలని ఒత్తిడి చేశారని దానివల్ల 28 కోట్లు అదనంగా జిఎస్టి కట్టాలని తనపై తన సంస్థ పై విచారణ చేపట్టారని విచారణ సందర్భంగా తనను అరెస్టు చేయాలని చూసారని కోర్టుకు వెళ్లేసరికి ఒక వ్యక్తిని కావాలని ఇబ్బంది పెడుతున్నారని కోర్టు గ్రహించి తనను అరెస్టు చేయవద్దని జడ్జిమెంట్ ఇచ్చిందని అన్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థ నిష్పక్షపాతంగా నిజాయితీగా ప్రభుత్వానికి కట్టాల్సిన పనులన్నీ కడుతుందని ఇది కేవలం వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు మాత్రమే విచారణ జరిగిందని ఆయన అన్నారు.విచారణ సందర్భంగా టీ న్యూస్ మరియు నమస్తే తెలంగాణ పత్రికలు తనను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వచ్చి విషయాన్ని రాజకీయం చేయాలని చూశాయని అన్నారు.కాంగ్రెస్ పార్టీని నన్ను వ్యక్తిగతంగా బదనం చేయాలని చూశారని కానీ అది సాధ్యపడలేదని కోర్టు తీర్పు తర్వాత వెంటపడ్డ టీవీ ఛానళ్లు ఒక్కటి కూడా కనిపించకుండా మాయమయ్యాయని అన్నారు.కావాలని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గతంలోని తన పరిచయాలను వాడుకొని వారి టీవీ ఛానల్లలొ మరియు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారని కోర్టు తీర్పే వారందరికీ చెంపపెట్టు అయిందని ఆయన తెలిపారు.
నియోజకవర్గంలో ఇసుకను తక్కువ ధరకు అందిస్తే వారి కళ్ళు మండుతున్నాయని వారి హయాంలో 6 వేలకు తక్కువ ధరకు ఇసుక ఏనాడు లేదని ఇప్పుడు 3000 లోపు వస్తే వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తక్కువ ధరకు ఇసుకను అందిస్తే ఇసుక మాఫియా అని అంటున్నారని ప్రశాంత్ రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలని అన్నారు బట్టాపూర్ లో క్రషర్ ద్వారా పదివేల క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకొని ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వి ప్రభుత్వానికి చుట్టుపక్కల రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిన చరిత్ర ప్రశాంత్ రెడ్డిది అని ఇలా అదనంగా క్యూబిక్ మీటర్లు తవ్వి ప్రభుత్వానికి 112 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాడని అలాగే కరెంటు బిల్లుల ద్వారా 52 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని ఆయన తెలిపారు.మేం అధికారంలో ఉన్నప్పటికీ ఏనాడు కక్షపూరితంగా వ్యవహరించలేదని మేము వీటిపై విచారణ జరపాలని ఎవరి మీద ఒత్తిడి తేలేదని ప్రశాంత్ రెడ్డి ధర్మ సూత్రాలు చెబుతూ దొమ్మరి వేషాలు వేస్తున్నాడని అన్నారు సంక్రాంతి లోపు ఏ తారీకునైనా తీసుకొని ముఖాముఖి చర్చా వేదిక పెట్టాలని సమయం తేదీ తెలపాలని ఎవరు అవినీతిపరుడు ఎవరు బకాసురుడు తేల్చుకుందామని ఒకవేళ చర్చకు రాకుంటే బట్టాపూర్ దొంగగా ప్రశాంత్ రెడ్డికి బాల్కొండ నియోజకవర్గ ప్రజల తరఫున నామకరణం చేస్తామని అన్నారు.ఇకనైనా ప్రశాంత్ రెడ్డి చిల్లర వేషాలు దొంగ పనులు మానుకొవాలని 120 కోట్లు ఖర్చుపెట్టి గెలిచి ఇంకా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆ దొంగ పనులు మానుకోవాలని హితవు పలికారు.కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
