
న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కోచ్ మాస్టర్ అహ్మద్ ఖాన్ కు ఘన సన్మానం.
( పయనించే సూర్యుడు జనవరి 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటారు. పటాన్‌చెరులోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో 'లక్ష్యం షూటోకాన్ కరాటే అకాడమీ ఇండియా' ఆధ్వర్యంలో అనిల్ యాదవ్ నిర్వహించిన 4వ నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్-2026లో వీరు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న న్యూ పవర్ కుంగ్ ఫు కోచ్ మాస్టర్ అహ్మద్ ఖాన్ (బ్రూస్ లీ) విద్యార్థులు వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. విద్యార్థుల ప్రతిభతో అకాడమీ ప్రతిష్టను జాతీయ స్థాయిలో చాటిచెప్పారు. క్రీడాకారులను తీర్చిదిద్దడంలో అహ్మద్ ఖాన్ చూపుతున్న కృషిని అభినందిస్తూ, నిర్వాహకులు ఆయన్ని ఘనంగా సన్మానించారు. అమర్ సింగ్ మాస్టర్, కేశవులు మాస్టర్ చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలరాజు మాస్టర్, శివ కృష్ణ మాస్టర్లతో పాటు పలువురు క్రీడాకారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజేతలను అభినందించారు.
