బీజేపీ యువ నాయకులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
అద్దంకి దయాకర్ రాజకీయాల్లో నోటి దూల తగ్గించుకోవాలి ఒక్కసారి కోమటిరెడ్డి బ్రదర్స్ మీద నోటి దూల పారేసిన తర్వాత ఏడాదిపాటు అజ్ఞాతం లోకి వెళ్లిపోయిన వాడివి నువ్వు! ఇప్పుడు మళ్లీ అదే దారిలో నడవాలని చూస్తే, ఈసారి రాజకీయ సన్యాసం తప్పదు దయాకర్!మోదీ మీద దుర్మార్గంగా, చీప్ స్థాయిలో మాట్లాడటం నీ అసలైన స్థాయిని ప్రజలకు చూపిస్తుంది.విమర్శలు రాజకీయాల్లో అవసరం… కానీ అవి నైతికతను కలిగినవై ఉండాలి, వ్యక్తిగత దూషణలు కాదు!నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మోదీ గారిని ‘దేశానికి పెద్దన్న’ అని గౌరవంగా అన్న మాటలు ప్రజలెవ్వరూ మర్చిపోలేరు. నువ్వే విన్నావు కదా? మరి నీవు మాట్లాడుతున్న భాష చూడగా రేవంత్ గారికే అవమానం చేస్తున్నట్టున్నావు దేశానికి స్వాతంత్రం తెచ్చినవాళ్లను మేము గౌరవించాం… కానీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మోదీ గారిని తిట్టే నీ అర్హతేంటి దయాకర్?“రా బే” అనేసే స్థాయి మాటలు మాకు కూడా వస్తాయి, మేమే ఇంకా బాగా వాడగలం.
కానీ మేము బీజేపీ కార్యకర్తలమూ… మాకు రాజకీయ సంస్కారం, దేశభక్తి, ప్రజాసేవే ధ్యేయం! బుద్ధి మార్చుకో దయాకర్… లేకపోతే నీ నోరే నీ రాజకీయ భవిష్యత్తుకి తాళం వేసేలా ఉంది జాగ్రత్త….