
( పయనించే సూర్యుడు డిసెంబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
నేషనల్ హెరాల్డ్ కేసులో తమ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీటును దిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం భారత జనతా పార్టీకి చెంపపెట్టు అని షాద్ నగర్ ఎమ్మెల్యే , ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లకు మంగళవారం ఊరట లభించడంతో.. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా భాజపా కార్యాలయాల ఎదుట బుధవారం నిరసనలు చేపట్టింది. ప్రతీకార రాజకీయాల కోసం దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు వాడుకుంటోందని ఆరోపించారు. దాని తీరుపై పార్లమెంటు లోపల, వెలుపల పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహ రెడ్డి,కార్పొరేషన్ చైర్మెన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి,షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన మండల పార్టీ అధ్యక్షులు కృష్ణా రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, జంగా నర్సింహులు,సుదర్శన్ గౌడ్, గూడ వీరేష్,మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్,నేతలు జితేందర్ రెడ్డి, నర్సప్ప గూడ కృష్ణ,శివ,మల్లేష్,దయానంద్ గుప్తా,తదితరులు పాల్గొన్నారు.
