బెల్టులు ప్రధానం చేసిన మాస్టర్ బాలరాజ్, మాస్టర్ అహ్మద్ ఖాన్
(పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
ప్రతి విద్యార్థినీ విద్యార్థి శారీరకంగా పటిష్టంగా ఉండాలంటే చదువుతోపాటు వ్యాయామ విద్యలు అవసరమని, వ్యాయామం చేయడం ద్వారా శరీరం గట్టిగా తయారవుతుందని న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ బాలరాజ్ అన్నారు. షాద్ నగర్ పట్టణం లోని సత్యనారాయణ స్వామి గుడి ఎదురుగా గల గ్రౌండ్ లో న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు బెల్టుల ప్రధానంచేశారు. న్యూ పవర్ కుంగ్ ఫు మాస్టర్ బాలరాజు, మాస్టర్ అహ్మద్ ఖాన్ (బ్రూస్ లీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాము నేర్చుకున్న కుంగ్ ఫు విద్యను ప్రదర్శించారు. అలాగే విద్యార్థిని విద్యార్థులు తమ చేతులతో బండలను మరియు పెంకులను పగలగొట్టి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలను ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమం లో కుంగ్ ఫు విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొని తమ తమ పిల్లలు ప్రదర్శించిన విద్యను చూసి మాస్టర్స్ ను అభినందనలు తెలిపారు.