
ఆవిష్కరణలో పాల్గొన కౌన్సిలర్స్,బీఆర్ఎస్ నాయకులు,యాజమాన్యం
(పయనించే సూర్యుడు జూలై 30 షాద్‌నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ప్రముఖ మారుతి సుజుకి డీలర్ శ్రీ జయరామ మోటార్స్ షాద్ నగర్ లోని చటాన్ పల్లిలో గల షోరూమ్‌లో న్యూ బ్రీజా కార్ ఆవిష్కరణ సందర్బంగా పూజా కార్యక్రమం అనంతరం సరికొత్త న్యూ మోడల్ మారుతి సుజుకి బ్రీజా కారును ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్సి నవీన్ రెడ్డి మాట్లాడుతూ మారుతి సుజుకి సంస్థ భారతీయ వాహన రంగంలో దశాబ్దాలుగా మిడిల్ క్లాస్ మరియు సామాన్య ప్రజల నమ్మకాన్ని సొంతం చేసుకుందని కొనియాడారు.మార్కెట్లోకి ఎలాంటి కొత్త మోడల్ తెచ్చినా,అది మైలేజ్ మరియు మెయింటెనెన్స్ పరంగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు వాణి పాండురంగారెడ్డి,అశోక్ యాదవ్ మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్,మాజీ సర్పంచులు తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు శేరి శ్రీనివాస్ రెడ్డి, దినేష్ సాగర్,అన్వారీ రాజు పేపర్ శివ, మహేష్,యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.