
అద్యక్షులుగా R సుధాకర్,ప్రధాన కార్యదర్శిగా తిమ్మరాజు మహారాజ్ లు ఎన్నిక
{పయనించే సూర్యుడు} {మార్చ్ 28మక్తల్ }
డా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో నూతనంగా పంచదేవ్ పహాడ్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్ నాయకులు మాట్లాడుతూ మక్తల్ నియోజవర్గ కమిటీ గత 45 సం,,ల క్రితం ఏర్పడిన అంబేద్కర్ యువజన సంఘం గ్రామాల్లో అంటారినితనం నిర్మూలన,దళిత,పేద వర్గాల పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేసిందని,అంతేకాకుండా గ్రామాల్లో ప్రజల సమస్యలపై అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై గళమెత్తి వారి సమస్యల పరిష్కారానికి పోరాడిన అంబేద్కర్ యువజన సంఘానికి మక్తల్ నియోజకవర్గ ప్రాంతంలో గొప్ప పేరుందని,ఎన్నికైన కొత్త కమిటీ కూడా అలానే పనిచేసి పేరు తెచ్చుకోవాలన్నారు.
అంతేకాకుండా ఎన్నికైన కొత్త కమిటీ నిచ్చెన కుల వ్యవస్థ కుట్రల నిర్మూలనకు,దళితుల,మహిళల విద్య,సామాజిక సమానత్వనాకై తమ జీవితాలను త్యాగం చేసినా, మహానీయులు పూలే,అంబేద్కర్ ల గొప్పతనాన్ని తెలియచేసేలా వచ్చేనెలలో రాబోయే వారి జయంతులను గ్రామంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించలన్నారు.అదేవిధంగా మక్తల్ నియోజక వర్గ కమిటీ పిలుపు మేరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ అంబేద్కర్ భావజాల చైతన్యాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీతో ప్రమాణస్వీకారం చేయించడం జరిగిందన్నారు.
పంచదేవ్ పహాడ్ అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీఅద్యక్షులు:R సుధాకర్ ఉపాధ్యక్షులు:
1) G రాజు 2) ఆటో కిష్టప్ప ప్రధాన కార్యదర్శి: 1) తిమ్మరాజు మహారాజ్ సహాయ కార్యదర్శి: 1)పళ్ళ అనిల్
2) N నాగరాజు కోశాధికారి: కొత్త సురేష్ సహాయ కోశాధికారి: R ఆంజనేయులు సాంస్కృతిక కార్యదర్శి:1)లక్ష్మణ్
సలహాదారులు:1)ఆనంద్ 2)రాజు 3)B నర్సింలు 4)B తిప్పన్న 5) ముకేష్ 6)G రమేష్ 7)N నర్సింలు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ అధ్యక్షులు పృథ్వీరాజ్, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి,KNPS జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న, వేంకటపతి రాజు, రవికుమార్,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
