కూనవరం పంచాయతీ నిధులు అవినీతిపై విచారణ చేపట్టిన అధికారివారికి ఆదివాసి సంక్షేమ పరిషత్ వినతి.
రాజకీయ పార్టీలు అవినీతిపరులకు వత్తాసు పలికి జనగ్రహానికి గురికావద్దు.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 24
కూనవరం మండలం కూనవరం మేజర్ పంచాయితీ కి సంబంధించిన నిధుల దుర్వినియోగం, అవినీతిపై ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉద్యమం మరియు ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేయడంతో బుధవారం నాడు జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలతో విచారణ అధికారిగా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి (DLDO అండ్ AO)వారిని రిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా కూనవరం పంచాయతీ కార్యాలయంలో విచారణ నిమిత్తం వచ్చిన విచారణ అధికారి వారికి ఆదివాసి సంక్షేమ పరిస్థితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విచారణ అధికారితో మాట్లాడుతూ కూనవరం పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండానే చేసినట్లు నిధులు స్వాహ చేసినట్లు ఆదివాసి సంక్షేమ పరిషత్ దృష్టికి రావడంతోటి పలు ఆధారాలతోటి ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వాటిలో ముఖ్యంగా పైప్ లైన్, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ పనులు, శానిటైజేషన్ పనులు, హెల్త్ మానిటరింగ్ పనులు చెయ్యకుండానే చేసినట్లుగా బినామీల పేర్లతోటి నిధులు డ్రా చేసినట్లు అధికారికి తెలియజేశారు. అదేవిధంగా కూనవరం పడవ రేవు పాటకు సంబంధించి పంచాయతీ ద్వారా ప్రభుత్వని అందాల్సినటువంటి సొమ్మును సక్రమంగా పంచాయతీ ఎకౌంటు ద్వారా పంపకుండా నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆయన అధికారికి తెలియజేశారు. 2022,2023, 2024 వరదలు నిమిత్తం మంజూరైన నిధులు విషయంలో కూడా అవినీతి జరిగినట్లు ఆయన తెలియజేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా అధికారులు సమగ్ర విచారణ జరిపితే పంచాయతీలో అనేక అవినీతి అక్రమాలు బయటపడతాయని ఆయన విచారణ అధికారిని కోరారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదివాసి సర్పంచ్ మరణం అనంతరం సర్పంచ్ పదవి స్వీకరించిన హేమంత్ మరియు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన సురేష్ అనే కార్యదర్శి ఇద్దరు కలిసి కూడా పంచాయతీ నిధులను దుర్వినియోగానికి అవినీతికి పాల్పడ్డారని ఆయన మీడియా ముఖంగా విమర్శించారు. అవినీతిపై ప్రశ్నించిన వారిని బెదిరించే ప్రయత్నాలు కూడా చేశారని ఇటువంటి తాటాకు చప్పులకు ఎవరు భయపడేది లేదని ఆయన అన్నారు. విచారణ అధికారులు కూడా సక్రమంగా చేయకుంటే న్యాయస్థానంలో కేసు వేస్తామని ఆయన హెచ్చరించారు. రాజకీయ పార్టీలు కూడా అవినీతి వైపు ఉంటారా? లేక అవినీతిని అరికట్టే వైపు ఉండి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తారా? తేల్చుకోవాలని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు. అవినీతికి పాల్పడిన వారిని రక్షించాలని చూస్తే వారు ఎంతటి ప్రజాప్రతినిధులైన రాజకీయ నాయకులైన ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. లక్షలాది రూపాయలు అభివృద్ధికి కేటాయించకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లుగా నిధులు డ్రా చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని క్రిమినల్ కేసులు వేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు కారం రవి, బొడ్డు బాలు, కొమరం వెంకన్న బాబు, పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నరు