
పయ నించే సూర్యుడు 11.02.2026 ముమ్మిడివరం ప్రతినిధిడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయం, అమలాపురం
జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా వారి కి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ శ్రేణులు ఘనంగా నివాళి ఈ సమావేశంలో మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ముఖ్య అతిథి రాష్ట్ర అడ్వైజరీ బోర్డు చైల్డ్ లేబర్ చైర్మెన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ:భారతీయ జనసంఘ్ నాయకుడిగా, రాజకీయ తత్వవేత్తగా, “ఏకాత్మ మానవతావాదం” (ఇంటిగ్రల్ హ్యూమనిజం) సిద్ధాంత ప్రతిపాదకుడిగా పండిట్ జీ చేసిన సేవలు చిరస్మరణీయం!సమాజంలో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి (అంత్యోదయ), ఆత్మనిర్భరత, సమతుల్య మానవ వికాసం వంటి ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకం.దేశ నిర్మాణంలో సిద్ధాంతాల కోసం అంకితభావంతో జీవించిన ఆ మహనీయుని స్ఫూర్తిని అందరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.పాల్గొన్న ప్రముఖ నేతలు:మాజీ శాసనసభ్యులు, భారతీయ కార్యమండలి సభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ నల్ల పవన్ కుమార్ మరియు అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ కర్రీ చిట్టిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం,జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకరమెల్లి శ్రీనివాసరావు, సలాది వీరబాబు, జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ, జిల్లా ఉపాధ్యక్షులు చెల్లింగి త్రినాధరావు, జిల్లా కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి,
ఈ ప్రోగ్రాం కన్వీనర్లు కోన సత్యనారాయణ, చిలకమర్తి కస్తూరి, జిల్లా మైనార్టీ, ఓ బి సి మహిళ మోర్చాల అద్యక్షులు షంసు సాధిక్, పసుపులేటి మహాలక్ష్మిరావు, ఎల్లానా శకుంతల, జిల్లా కార్యదర్శి మోకా ఆదిలక్ష్మి, రాష్ట్ర మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి నూన్న హుస్సేన్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాద్యక్షుడు దిగుమార్తి ఏడుకొండలు, అమలాపురం టౌన్, రూరల్ మండల అధ్యక్షులు అయ్యాల భాస్కరరావు, బోంతు శివాజీ, డివిఎస్ రాజు , గొల్ల కోటి వెంకటరెడ్డి , మట్ట సూరిబాబు, అల్లవరం, మామిడికుదురు, రామచంద్రపురం, ముమ్మిడివరం మండలాల అధ్యక్షులు కట్ట నారాయణ, బైరిశెట్టి దుర్గాప్రసాద్, దూనే శ్రీనివాస్, వీరభద్ర శర్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్ట సూరిబాబు, గాడి సత్తిబాబు, నాగార్జున ప్రసాద్ ,బండి శ్రీనివాస్, డి శ్రీనివాస్ , కొండేటి విజయలక్ష్మి, జిల్లా కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నరు పండిట్ దీనదయాళ్ గారి అంత్యోదయ మంత్రం ఇప్పటికీ ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి బలమైన ఆధారం! ఆయన ఆదర్శాలు మనందరినీ స్ఫూర్తిపరుస్తాయి…
