మొదటి ప్రాధాన్యత ఓటు లో 1 నెంబర్ వేయాలి..
▪️ఎమ్మెల్సీ ఎన్నికల్లో 42 నియోజకవర్గాల కంటే హుజురాబాద్ నుంచి మెజారిటీ ఇస్తాం..
▪️విద్యారంగ సమస్యలపై దృష్టి సారిస్తం..
▪️మెజారిటీతో నరేందర్ రెడ్డి మండలికి వెళ్ళడం ఖాయం.
▪️విద్యావేత్తగా సామాన్య ప్రజలకు సేవ..
పయనించే సూర్యుడు // ఫిబ్రవరి 10// హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్// కుమార్ యాదవ్.. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందేర్ రెడ్డి, భారీ మెజారిటీతో మండలికి వెళ్లడం ఖాయమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సభకు ఆయన ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అభ్యర్థి(ఆల్ ఫోర్స్) నరేందర్ రెడ్డి తో పాటు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ..పట్టభద్రులు ఓటును వృధా చేసుకోవద్దని,ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలని సూచించారు.హుజరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 13వేల పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్పార్టీ,నాయకులు,ఎన్.ఎస్.యు.ఐ,యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ అనుభంద సంఘాలు పనిచేసి హుజరాబాద్ నుండి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని కోరారు. 42 నియోజకవర్గాలకంటే హుజురాబాద్ నుండే అధిక మెజారిటీ వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.మండలికి వెళ్లిన తదుపరి హుజురాబాద్ నియోజకవర్గానికి విద్యారంగంపై తగిన నిధులు కేటాయించాలని కోరారు. విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధిక ప్రాధాన్యత ఇచ్చిందని దాంట్లో భాగంగానే ఏడాది కాలంలోనే 55,000 మందికి నియామకపత్రాలను అందజేశామని తెలిపారు.54 ఏళ్ల వయసులో 54 విద్యాసంస్థలను నెలకొల్పడం ద్వారా విద్యారంగం పట్ల నరేందర్ రెడ్డికి ఉన్న శ్రద్ధ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సత్య ప్రసన్న రెడ్డి,హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి రాజేశ్వరి-స్వామిరెడ్డి,సింగిల్ విండో చైర్మెన్ సుగుణాకర్ రెడ్డి, ఆంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ కోలిపాక శంకర్,హుజురాబాద్ మండల అధ్యక్షుడు కిరణ్ కుమార్,హుజురాబాద్ పట్టణ,మండల మహిళా అధ్యక్షురాలు పుష్పలత, రాధ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్, ,సొల్లు బాబు,లావణ్య,లక్ష్మారెడ్డి,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోస్కుల శ్రీనివాస్, మిడిదొడ్డి రాజు, కొక్కుల రవిందర్,మాజీ ఎంపీటీసీ సభ్యులు దండ శోభ-విక్రమ్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ రాజేంద్ర ప్రసాద్,వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,మైనారిటీ నాయకులు , అఫ్సర్, ఉస్మాన్ పాష, వివిధ విద్యాసంస్థల ప్రిన్సిపల్ లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలపై కృషి చేస్తా నరేందర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి కోరారు.ఎన్నో ఏళ్లుగా విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను, పరిష్కరిస్తానని, లైబ్రరీల విషయంలో ప్రణాళికతో ముందుకు, వెళ్తానని, అన్నారు. హుజురాబాద్ లైబ్రరీకి 70000 తో షెడ్డు వేయడం జరిగిందని, 12 సంవత్సరాలుగా గురుకులాల్లో జరగని బదిలీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరిగినాయని ఇది రేవంత్ రెడ్డి పనితీరుకు నిదర్శనమని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీలకు తగినన్ని నిధులు కేటాయించడంతోపాటు విద్యా, వ్యవస్థను, చక్కదిద్దుతున్నారని అన్నారు.ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత గుర్తు ఒకటో నెంబర్ పై వేసి ఆశీర్వదించాలని కోరారు.