{ పయనించే సూర్యుడు} {అక్టోబర్ 18} మక్తల్
మక్తల్ పట్టణంలోని అతి పురాతనమైన పడమటి ఆంజనేయస్వామిని శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వంశ పారంపర్య పూజారి ప్రాణేశ చారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో మంత్రిని ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అతి పురాతనమైన స్వామి వారి కోనేరు పునరుద్ధరణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిని అభినందించారు. కోనేరు చాలా అద్భుతంగా ఉందని కోనేరు అభివృద్ధి జరిగితే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దీంతో దిన దిన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్. పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు