
పయనించే సూర్యుడు/ డిసెంబర్/ 2/మక్తల్ /
మక్తల్ పట్టణంలోని శ్రీ శ్రీశ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మక్తల్ పట్టణంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి హాజరైన సీఎం ఇక్కడి పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో సీఎం పేరిట అర్చన చేసిన అర్చకులు ఆయనను వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు సీఎం ఎ .రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ వాకాటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రి దామోదర రాజనర్సింహ, తో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.