
క్రీడా సామాగ్రికి దరఖాస్తు చేసుకోండి
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
మేరా యువ భారత్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , (గతంలో నెహ్రూ యువ కేంద్రం), భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2025-26 సంవత్సరానికి క్రీడా సామగ్రి పంపిణీ కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యువజన క్లబ్‌ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల యువజన క్లబ్‌లు 18-02-2026న లేదా అంతకు ముందు మై భారత్ కార్యాలయానికి వచ్చి స్పోర్ట్స్ కిట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమర్పించడానికి మై భారత్ కాకినాడ చిరునామా ఈ క్రింది విధంగా ఉంది.షట్రాజ్ బిల్డింగ్ మొదటి అంతస్తు, ప్లాట్ నెంబర్ 1, ఇండస్ట్రియల్ ఎస్టేట్, రమణయ్యపేట, కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ పిన్ కోడ్:533005 ఆఫీస్ ల్యాండ్‌లైన్ నెం.08842945234 మరిన్ని వివరాల కోసం దయచేసి కాకినాడలోని మేరా యువ భారత్ జిల్లా యువజన అధికారి టి. గోపి సంప్రదించండి.