పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి. నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి మే 17
మెగా DSCలో నోటిఫై చేసిన షెడ్యుల్ ప్రాంత పోస్టులకు విడిగా ఏజెన్సీ DSC ప్రకటించాలి. *షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయ్యాలి. గిరిజన సలహా మండలి(TAC)ని వెంటనే ఏర్పాటు చెయ్యాలి… ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కంగల శ్రీనివాసు *ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ITDA,రంపచోడవరం మండల కేంద్రంలో మెగా DSCలో నోటిఫై చేసిన షెడ్యుల్ ప్రాంత పోస్టులకు విడిగా ఏజెన్సీ DSC ప్రకటించాలని, షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయ్యాలి అని ప్రభుత్వన్ని డిమాండ్ చేసారు. మెగా DSC GO 15 రాజ్యంగా విరుద్దం అని షెడ్యూల్ ప్రాంతంలో నియామకాలు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎడ్యుకేషన్ పరిధిలోకి రావని వెంటనే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చెసి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసి ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలు స్థానిక ఆదివాసులతో భర్తీ చేయాలని డిమాండ్ చేసారు
3వ రోజు రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్న వారు పోడియం పండు దొర,మడకం ప్రసాద్ దొర,చవలం శుభ కృష్ణ,పండ పవన్ కుమార్ దొర,కంగల అబ్బాయి దొర,బంధం రామకృష్ణ,కంగల గిరిబాబు దొర,మడకం లచ్చన్న దొర,వీక బుల్లి కొండలు,వంతల దుర్గ,బంధం ఆనంద్, కుంజం రామకృష్ణ,చవలం వెంకన్న దొర మరియు సంఘ నాయకులు పాలొన్నారు.