పయనించే సూర్యుడు గాంధారి 10/01/25
ఎల్లారెడ్డి నియోజకవర్గ గాంధారి మండల పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన సితాయిపల్లి సాయిలు త oడ్రి బాలయ్య (వ.36) మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో బైక్ పై నుండి పడి తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తమై మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సంప్రదించగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో మాట్లాడి చేర్పించారు. సాయిలు బీద పరిస్థితిని అర్థం చేసుకుని అతని చికిత్సకయ్యే ఖర్చును ఎమ్మెల్సీ కవిత అక్క ద్వారా రూ.1,50,000/- ల్ ఓ సి ని మంజూరు చేయించారు. ఈ ఎల్ ఓ సి పత్రాన్ని మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిమ్స్ ఆసుపత్రి వెళ్లి పేషంట్ కుటుంబ సభ్యులకు అందజేసిన గాంధారి మండల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రెడ్డి రాజు మరియు సాయిలు.ఆపద సమయంలో ఆదుకున్న ఎమ్మెల్సీ కవితక్క మరియు మాజీ ఎమ్మెల్యే సురేందర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు.*