పయనించే సూర్యుడు మే 01 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి,భట్టి విక్రమార్క మల్లు గార్ల చే హైదరాబాద్ (రవింద్ర భారతి) లో వెలువడించిన పదోవ తరగతి ఫలితాల లో భాగంగా తెలంగాణ రాష్టం,ప్రత్యేకంగా వైరా నియోజకవర్గం లో ఉత్తీర్ణులైన విధ్యార్ధిని,విధ్యార్ధులకు వైరా నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు శ్రీ మాళోత్ రాందాస్ నాయక్ శుభాభినందనలు తెలియచేసారు. ఇదే ఉత్తేజంతో భవిష్యత్ కాలంలో ఉన్నత స్ధానాలను అదురోహించాలని,తల్లిందండ్రులకు,నడయాడిన నేలకు మంచి పేరు తీసుకురావాలని అకాంక్షించారు. ఉత్తీర్ణులు కాలేకపోయిన విధ్యార్ధిని,విధ్యార్ధులకు దేవుడు మనోధైర్యం కల్పించాలని,క్షణకా అవేశపు నిర్ణయాలను తీసుకోకుడదు అని,క్రుంగు బాటుకు లోను కాకుండా,మన కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులను ద్రుష్టి ఉంచుకొవాలని, ప్రతి విజయం ఓటమితో ఫ్రారంభం అవుతుంది అని,పునరుత్తేజంతో ముందుకు సాగాలని,ఈ పోటి ప్రపంచంలో పోటి పడి ముందుసాగాలని అకాంక్షించారు