పయనించే సూర్యుడు మార్చి 15 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మార్చి 17వ తేదీ నుంచి మొదలయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు చేజర్ల మండలంలోని పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడమైనది. మండలంలోని ఆరు ఉన్నత పాఠశాలలు, గురుకుల ఉన్నత పాఠశాల, ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులతోపాటు దాచూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు కూడా చేజర్ల మండలంలోని పరీక్షా కేంద్రాలకు హాజరవుతారు. మొత్తం 364 మంది విద్యార్థులను చేజర్ల ఉన్నత పాఠశాలకు 144 మందిని, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 118 మందిని , విజ్ఞాన్ జూనియర్ కళాశాలకు 102 మందిని కేటాయించడమైనది. ప్రతి పరీక్షా కేంద్రం నందు విద్యార్థులకు అవసరమైన బెంచీలు, త్రాగునీరు, లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్ నందు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మరియు చీప్ లతో పాటు మూడు సెంటర్లకు కలిపి 32 మంది ఇన్న్విజిలేటర్లు బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రతి సెంటర్ నందు పోలీసు వారు విధులు నిర్వహిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.కావున విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు సహకరించాలని కోరుతున్నాము. మండల విద్యాశాఖ అధికారులు శనివారం తెలిపారు