పయనించే సూర్యుడు అక్టోబర్ 13 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
నంద్యాల జిల్లా,ఫెన్సింగ్ లో ఏషియన్ గేమ్స్ నందు సత్తా చాటిన పబ్బతి చిన్మయి శ్రేయ అంతర్జాతీయంగా మరిన్ని విజయాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆకాంక్షించారు.సోమవారం పద్మావతి నగర్ లోని ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు బిల్డర్ పబ్బతి వేణుగోపాల్ స్వగృహానికి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, శప్ చైర్మన్ రవి నాయుడు, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు , నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్ తెలుగుదేశం పార్టీ నాయకులు శమీముల్లా తదితరులు విచ్చేశారు .
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఫెన్సింగ్ క్రీడాకారుని పబ్బతి చిన్మయి శ్రేయతో ఫెన్సింగ్ క్రీడా మరియు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఫెన్సింగ్ క్రీడలో నంద్యాల జిల్లా కీర్తిని అంతర్జాతీయంగా మారు మోగేలా చేశావని ప్రత్యేకంగా అభినందించారు .అనంతరం శాలువా కప్పి సత్కరించారు. పబ్బతి వేణుగోపాల్, అడ్వకేట్ అపర్ణ దంపతులు మంత్రి ఎన్ఎండి ఫరూక్ షాప్ చైర్మన్ రవి నాయుడు టిడిపి నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ లను సత్కరించారు