
2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి
పరిశ్రమలో స్థానిక యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్
పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా 14 సెప్టెంబర్ 2025
తెలంగాణ సాయుధ పోరాట వారసురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం సిపిఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్యంమాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట వారసురాలు కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటంలో భూమికోసం భుక్తి కోసం వెట్టి శాఖ విముక్తి కోసం జరిగిన పోరాటంలో 10 లక్షల భూములను పంచారు. అట్లాంటి భూమిని ముని దేవుని పల్లి లో పంట పొలాలు ఆకుకూరలు చక్కటి పంటలు పండుతాయి కాబట్టి ఆ భూమిని పరిశ్రమలకు ఇస్తే పరిచయం యజమానులు అక్కడ గ్రామాల్లో ఉన్న వారిని ఉద్యోగాలలో కచ్చితంగా పెట్టుకోవాలి కర్ణాటక మహారాష్ట్ర హైదరాబాద్ వాసులను తెచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తే గ్రామాల్లో ఉన్న ఎట్లాంటి మేలు జరగదని అందుకని పరిశ్రమ పెట్టిన వెంటనే చుట్టుపక్కల ఉన్న మూడు నాలుగు గ్రామాలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారుసర్వ నెంబర్ 92 లో గల సుమారు భూమి 293 ఎకరాల భూమిని 277 మంది రైతులు గత దశాబ్దాల కాలంగా సాగు చేసుకుని జీవనం గడుపుతున్నారు. రైతుల భూమిని బడా కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని, భూములు ఇవ్వవలసి వస్తే 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఉద్యోగాలు ఇవ్వాలి.ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, రైతుల ఒప్పందంతో ప్రకారం భూములు తీసుకోవాలి. ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు భూములు తీసుకుంటే ఊరుకునేది లేదన్నారు. గ్రామపంచాయతీ నోటీసు నోటీసు బోర్డులో రైతుల పేర్లు అతికించాలి .కబ్జాలల్లో నష్టపరిహారం అందేలా చూడాలని,గతంలో పట్టా పాస్ పుస్తకాలు సర్టిఫికెట్లు ఉన్న భూప్రక్షాళన వచ్చిన తర్వాత కొన్ని పేర్లు రికార్డులలో లేవు వారి కూడా ప్రభుత్వ అధికారులు దృష్టి రైతుల పేర్లు చేర్చాలి గ్రామంలో ఉన్నటువంటి రైతులకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ న్యాయం చేయాలని 2013 చట్ట ప్రకారము నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ప్రైవేటు సంస్థ ధరలు తగ్గించాలి ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే.రాజయ్య,పార్టీ సభ్యులు గోపాల్, శ్రీనివాస్, మానయ్య, రామచంద్రి, శీను,రైతులు కమల్ రెడ్డి,నర్సింలు, మందుల మల్లయ్య లక్ష్మారెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.