పయనించే సూర్యుడు న్యూస్ మందమర్రి మండల ప్రతినిధి. బొద్దుల భూమయ్య…
కెమికల్ & ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో ఉద్యోగ భద్రతపై అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామును కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.అని తెలుపుటకు సంతోషిస్తున్నాము.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పరిశ్రమల్లో సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వాలని మేనేజ్మెంట్పై దృష్టి సారించారు.పాశమైలారం సిగాచి ప్రమాదం అందరికీ పాఠం కావాలని, కేవలం ₹20 లక్షలతోనే ఆ ప్రమాదం నివారించవచ్చని, కానీ నిర్లక్ష్యం కారణంగా 53 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.కంపెనీల్లో జీరో ఆక్సిడెంట్ స్టాండర్డ్స్‌ను అమలు చేయాలని సూచించారు.రెడ్ కేటగిరీ కంపెనీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సేఫ్టీ లోపాలు ఉంటే నోటీసులు ఇవ్వబోతున్నామని హెచ్చరించారు.ప్రతి నెల కార్మికులకు భద్రతపై ఒకరోజు శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు.ఈ సమావేశంలో కెమికల్, ఫార్మసిటికల్ కంపెనీల ప్రతినిధులు, ITI కాలేజీల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.