పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 18మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి కాశబొయిన మహేష్ చేగుంట మండలం వడియారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పలు రికార్డులను పరిశీలించి విద్యార్థులకు విద్యాబోధన చేశారు 10వ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం బోధించి పలు ప్రశ్నలను అడిగి వారితో సమాధానాలు రాబట్టారు విద్యార్థులు సరి అయిన సమాధానాలు తెలపడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు పాఠశాలలోని వంటగదిని పరిశీలించి స్టోర్ రూమ్ లో ఉన్న నిత్యవసర సరుకులను ఆయన పరిశీలించారు, పంట పాత్రను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా కడిగి విద్యార్థులకు భోజనాన్ని వడ్డించే ముందు నిర్వాహకులు చేతులను పరిశుభ్రంగా కడుక్కొని వడ్డించాలని ఆయన వంట నిర్వాహకులకు సూచించారు, సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందచేసిన కంప్యూటర్ డిజిటల్ ల్యాబ్ ను ఆయన పరిశీలించారు, అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ గతంలో కంటే ఈసారి విద్యార్థుల హాజరు శాతం మరింత పెరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు పాఠశాలలకు తప్పనిసరిగా హాజరుకావాలని విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షల దగ్గర పడుతునందున విద్యార్థులకు ఎలాంటి ఇంటి పనులు చెప్పకుండా వారిని సక్రమంగా పాఠశాలలకు పంపే విధంగా చూసుకోవాలని ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యాబోధన అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.