పయనించే సూర్యుడు. మార్చి 21. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
గుట్టలను యదేచ్ఛగా మట్టి చేసి వేరేచోట కు తరలించి సొమ్ము చేసుకుంటున్న కొందరు అక్రమార్కులు పై చర్యలు తీసుకోవాలి అంటూ వినతిపత్రాలు అందజేసిన తంబర్ల హ్యూమన్ రైట్స్ సొసైటీ బహుజన అభ్యుదయ సేవా సమితి భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తంబర్ల నరసింహారావు మాట్లాడుతూ
మండల పరిధిలో ఎక్కడ చూసినా గుట్టలతో పచ్చని చెట్లతో పిచ్చుకల అరుపులతో ఆహ్లాదాన్ని మండల ప్రజలకు అందించినటువంటి ఘనత మండలానిది అలాంటి పరిస్థితులు గతంలో ఉండగా ఇప్పుడు కొందరు మాట్లాడుతూ మాకు పర్మిషన్లు ఉన్నవి మేము ఎంతటి గుట్టలనైనా పిండి చేసేటటువంటి సత్తా మా దగ్గర ఉంది అంటూ రెచ్చిపోతూ గుట్టలను చెట్లు వృక్షాలను కొద్దికొద్దిగా మాయం చేస్తూ ఉంటే వర్షాలు రాక నదులు వాగులు, చెరువులు ఎండిపోయి వన్యప్రాణులు చనిపోయి ముందు తరానికి ముప్పుగా మారే ప్రమాదంగా చేరి స్వచ్ఛమైన గాలిని కొనుక్కోవాల్సి వస్తుంది అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణమే ప్రజా ప్రయోజనాల కొరకు గుట్టలను కరిగించి మట్టి తోలడానికి గల కారణాలేంటి వారికున్న పర్మిషన్ ఏంటి క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు హాని చేసే అంతటి పర్మిషన్లు ఉంటే వాటిని రద్దు చేసి ప్రజలకు మేలు చేయాలని కోరుతూ ఈరోజు జూలూరుపాడు తాసిల్దార్ కి ఎస్సై కి వినతిపత్రాలు అందించడం జరిగిందని వారు తెలియజేశారు