_పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 4, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ
ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి ఆదేశాల మేరకు అసెంబ్లీ కన్వీనర్ శ్రీరాములు కో కన్వీనర్ నాగరాజు గౌడ్ సూచన మేరకు ఆదోని మున్సిపల్ కమిషనర్ కృష్ణ ని కలిసి పర్వతాపురం వెళ్లే దారిలో ఉన్న రోడ్డు మరమ్మతులు చేపట్టాలని మాట్లాడటం జరిగింది..ఆ రోడ్డు మార్గాన ప్రతిరోజు ఆటోలలో విద్యార్థులు ప్రజలు ద్విచక్ర వాహనాల మీద తిరుగుతూ ఉంటారని వెళ్లే సమయంలో ఆటోలు కానీ ద్విచక్ర వాహనాలు బోర్లపడి ఏదైనా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అని అలాగే ఆ పరిధిలో కాటన్ జిన్నింగ్ ఫ్యాక్టరీలకు పత్తి తో లోడ్ చేసుకున్న లారీలు, ట్రాక్టర్లు ఆటోలు వస్తూ ఉంటాయని ఆ వచ్చే సమయంలో గతంలో చాలా సార్లు ప్రమాదాలు కూడా జరిగాయని ఈ పర్వతాపురం రోడ్డు ఈఎస్ఐ హాస్పిటల్ నుండి ఊరిలో ఉన్న మఠం వరకు కూడా ఇదే పరిస్థితి హెచ్చుతగ్గులతో అధ్వాన స్థితిలో ఉంది అని కమిషనర్ కి వివరించడం జరిగింది.కావున వీలైనంత తొందరగా రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రాణ నష్టం జరగకుండా పనులు మొదలు పెట్టాలని మున్సిపల్ కమిషనర్ ని కోరడం జరిగింది..కార్యక్రమంలో బిజెపి నాయకుల కిరణ్ , బీజేవైఎం నాయకులు వినోద్ కుమార్ తదితర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.