పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12. పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా అల్లుకోల సర్పంచ్ ప్రతినిధి దువ్వాడ రవి నియమితులయ్యారు. పలాస కాశీబుగ్గ ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో పలాస మండల వైసీపీ కార్యవర్గం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలాస మండల వైసీపీ అధ్యక్షులుగా దువ్వాడ రవి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు పలాస మండలం వైసీపీ కార్యవర్గానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని అన్నారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, జిల్లా ఉపాధ్యక్షులు పైల చిట్టిబాబు, జిల్లా సెక్రటరీ బత్తిన హెమేశ్వరరావు, పలాస ఎంపీపీ ప్రతినిధి ఉంగ సాయి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు, పలాస సర్పంచులు సంఘం అధ్యక్షులు కొర్ల సంతోష్, సీనియర్ నాయకులు బొడ్డు సుధాకర్, రాపాక చిన్నారావ్, సైన దేశయ్య, సర్పంచులు, ఎంపీటీసీ లు తదితరులు పాల్గొని నూతన అధ్యక్షులను అభినందించారు.