
పయనించే సూర్యుడు 13 6 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : ఈరోజు శనివారం రోజున బాల్కొండ నియోజకవర్గంలో పలు బాధితుల కుటుంబలను పరామర్శించిన రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కమ్మరపల్లి మండలం లో దమ్మన్నాపేట గ్రామంలో రాజుల రమేష్ వాళ్ల అన్న ఇటీవల మరణించారు వారి కుటుంబంన్ని పరామర్శించటం జరిగింది కొనసాముందర్ గ్రామంలో లాడే అశోక్ వాళ్ల కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడు వారిని పరామర్శించటం జరిగింది.భీంగల్ పట్టణ కేంద్రంలో లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీ లో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ముగ్గురు చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించిన రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వారికి ప్రభుత్వం తరఫున తగు సహాయాన్ని అందజేస్తామని తెలియజేశారు. టీజీఎండీసీ చైర్మన్ ఈరవాత్రి అనిల్ మానాల మోహన్ రెడ్డి కలిసి వారికీ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.వారి వెంట భీంగల్ మున్సిపల్ చైర్మన్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి వైస్ చైర్మన్ జేజె నరసయ్య భీంగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు కమ్మర్ పల్లి మండల అధ్యక్షుడు భాస్కర్ భాస్కర్ మాజీ మండల అధ్యక్షులు సుంకేటా రవి వివిధ గ్రామాల సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు