
అద్యక్షులుగా M శంకర్,ప్రధాన కార్యదర్శిగా J రాజు లు ఎన్నిక
పయనించే సూర్యుడు మార్చు 27మక్తల్
డా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో కాల పరిమితి ముగిసినందున పసుపుల అంబేద్కర్ యువజన సంఘం పాత కమిటీని రద్దు చేసి,గ్రామ ప్రజల సమక్షంలో నూతనంగా కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్ నాయకులు మాట్లాడుతూ మక్తల్ నియోజవర్గ కమిటీ పిలుపు మేరకు పసుపుల అంబేద్కర్ యువజన సంఘం పాత కమిటీ గ్రామంలో అంబేద్కర్ జయంతి వర్ధంతులతో పాటు వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం మరియు కమిటీ ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంలో ఎప్పుడూ ముందుండేవారన్నారు.ఆ క్రమంలోనే పోయినా సంవత్సరం ఎంతో కష్టపడి గ్రామంలోని అందరి సహకారంతో చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా పసుపుల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారన్నారు.అదే విధంగానే నూతనంగా ఎనికైన కమిటీ బాధ్యులు కూడా రాబోవు రోజుల్లో గ్రామంలోని దళితుల,సబ్బండ వర్గాల పిల్లల విద్యాభివృద్ధికి సలహా సహకారలతో పాటు గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.అంతేకాకుండా మక్తల్ నియోజక వర్గ కమిటీ పిలుపు మేరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ అంబేద్కర్ భావజాల చైతన్యాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు.అనంతరం పసుపుల డా అంబేద్కర్ విగ్రహం ముందు నూతనంగా ఎన్నికైన కమిటీతో ప్రమాణస్వీకారం చేయించడం జరిగిందన్నారు.
అంబేద్కర్ యువజన సంఘం పస్పుల నూతన కమిటీ.అద్యక్షులు:శంకర్.ఉపాధ్యక్షులు:1) K లింగన్న2) శివకుమార్ ప్రధాన కార్యదర్శి:జే రాజు సహాయ కార్యదర్శి: 1)ఆకాష్ 2) B రాజు కోశాధికారి:D నరేష్
సహాయ కోశాధికారి:B అశోక్ సాంస్కృతిక కార్యదర్శి: నేతాజీ సలహాదారులు: 1)T లింగన్న 2)K నర్సింలు
3)G ఆశప్ప 4)M నర్సింలు 5) జే నర్సింలు 6)B నర్సింలు (దాసు) 7)B పరుశురాం ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ అధ్యక్షులు పృథ్వీరాజ్, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి,KNPS జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న, రవికుమార్ పసుపుల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
