పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉందని.. ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలని భారతీయులు ముక్తకంఠం తో నినదిస్తున్నారు. పహల్గాం టెర్రర్ ఎటాక్ తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది. సింధూ జల ఒప్పందాన్ని రద్దు చేసు కుంది. పాకిస్తాన్ పౌరులకు వీసా లు నిషేధించింది. దౌత్య సంబంధాలను తెంచు కుంది. అయితే ఇవేవీ భారతీయులకు సంతృప్తిని ఇవ్వట్లేదు. పాకిస్తాన్ సైన్యం సరిహద్దు ల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించ డం, యుద్ధ విమానాలను సరిహద్దు లకు తరలించడం వంటి చర్యలు భారతీయుల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పి స్తున్నాయి. పాకిస్తాన్ దశాబ్దాలుగా కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందనే విషయం అందరికీ తెలుసు. కానీ తమకేమీ తెలియనట్లు బుకాయిస్తుంటుంది. భారత్ ఆధారాలతో సహా పాక్ పాత్రను బయటపెట్టి నా నంగనాచి కబుర్లు చెప్తుంటుంది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2008లో ముంబై ఉగ్రవాద దాడి, 2019లో పుల్వామా దాడి వంటి ఘటనల్లో తమ ప్రమేయాన్ని మొదట పాకిస్తాన్ ఒప్పుకోలేదు. అయితే భారత్ స్పష్టమైన ఆదారాలను అంతర్జాతీయ సమాజం ముందుంచింది. దీంతో పాక్ దిగిరాక తప్పలేదు. ఇప్పుడు కూడా అంతర్జా తీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఒంటరిని చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది, ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలికి ఆధారాలను సమర్పించడం ద్వారా పాకిస్తాన్‌ను దోషిగా నిలబెట్టేందుకు చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండ టం, అంతర్గత రాజకీయ అస్థిరత, బలూచిస్తాన్‌లో వేర్పాటువాద ఉద్యమాలు ఆ దేశాన్ని సవాళ్లలో ముంచెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ సైనిక, ఆర్థిక, దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచుతోంది. అయితే పాకిస్తాన్ ను దెబ్బకొట్టేం దుకు ఇదే సరైన సమయ మనే వాళ్ల సంఖ్య పెరుగు తోంది. భారత్ – పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. రెండు దేశాలూ సైన్యాన్ని అప్రమ త్తం చేశాయి. ఏ క్షణంలో ఏం జరిగినా ఎదుర్కొనేందు కు సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో గతంలో రెండు దేశాల మధ్య ఎప్పుడెప్పు డు యుద్ధాలు జరిగాయో ఓసారి చూద్దాం. భారత్-పాకిస్తాన్ మధ్య 1947 నుంచి నాలుగు ప్రధాన యుద్ధాలు జరిగా యి. ఇక చిన్నాచితకా ఘర్షణలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే మొదటిసారి 1947లో భారత్ – పాక్ మధ్య యుద్ధం జరిగింది. దీన్ని మొదటి కాశ్మీర్ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు ఏడాది పాటు జరిగింది. 1947లో బ్రిటిష్ ఇండియా విభజన తర్వాత, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారత్‌లో విలీనం కావాలని నిర్ణయిం చింది. దీనిని వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్ మద్దతున్న గిరిజన దళాలు కాశ్మీర్‌లోకి చొచ్చుకొని వచ్చాయి, దీంతో యుద్ధం మొదలైంది. భారత సైన్యం గిరిజన దళాలను వెనక్కి తరిమి కొట్టింది. కానీ యుద్ధం ముగిసే సమయానికి కాశ్మీర్లో మూడో వంతు భాగం పాకిస్తాన్ నియంత్ర ణలోకి వెళ్లిపోయింది. దీన్నే మనం ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పి ఒ కె అని పిలుస్తున్నాం. ఐక్య రాష్ట్ర సమితి జోక్యంతో కాల్పుల విరమణ జరిగింది. నియంత్రణ రేఖ యల్ ఒ సి ఏర్పాటైంది. ఈ యుద్ధంలో భారత్‌కు వ్యూహాత్మక విజయం లభించినప్పటికీ, కాశ్మీర్ వివాదం పరిష్కారం కాలేదు. మొదటి కాశ్మీర్ యుద్ధంలో పూర్తి స్థాయి ఫలితం రాలేదు. దీంతో కాశ్మీర్ నిత్యం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. కశ్మీర్ కోసం 1965లో మరోసారి యుద్ధం జరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య రెండో యుద్ధం 1965లో జరిగింది. దీన్ని రెండో కాశ్మీర్ యుద్ధం అని పిలుస్తారు. కాశ్మీర్లో తిరుగుబాటును రెచ్చగొట్టేం దుకు ఆపరేషన్ జిబ్రాల్టర్ ప్రారంభించింది పాకిస్తాన్. గిరిజన దళాలను కాశ్మీర్‌లోకి పంపింది. వీటిని భారత్ గట్టిగా తిప్పికొట్టడంతో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రెండు దేశాలు భారీగా నష్టపోయాయి. పాకిస్తాన్ భూభాగంలోకి భారత్ చొచ్చుకెళ్లి కీలకమైన ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. అయితే అప్ప టి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో తాష్కెంట్ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రెండు దేశాలు తమ స్వాధీనంలోని భూభాగాలను తిరిగి ఇచ్చాయి. ఈ యుద్ధంలో సైనిక పరంగా భారత్ పైచేయి సాధించింది. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య మూడో యుద్ధం 1971లో జరిగింది. ఈ యుద్ధం మూలంగానే బంగ్లాదేశ్ కు స్వాతంత్రం వచ్చింది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్.. మనపైనే కాలు దువ్వుతోంది. 1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధాన్ని బంగ్లాదేశ్ స్వాతంత్ర్య యుద్ధంగా పిలుస్తారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రస్తుత బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ గా ఏర్పడింది. అయితే దీనిపై అధికారం ప్రస్తుత పాకిస్తాన్ గా పిలవబడే పశ్చిమ పాకిస్తాన్ చేతిలో ఉండేది. అయితే తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ తమకు స్వాతంత్రం కావాలని పోరాడింది. దీన్ని అణచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ లో మార ణహోమం సృష్టించింది. దీంతో బంగ్లాదేశ్ విముక్తికి భారత్ మద్దతుగా నిలిచింది. దీంతో యుద్ధం మొదలైంది. అతి తక్కువ సమయంలోనే తూర్పు పాకిస్తాన్‌ను భారత్ స్వాధీనం చేసుకుంది. తోంబై ముడు వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. బంగ్లాదేశ్ కు స్వాతంత్రం రావడానికి ఈ యుద్ధమే కారణం. ఈ యుద్ధంలో భారత్ తిరుగులేని పైచేయి సాధించింది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్, భారత్ మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయి.