పయనించే సూర్యుడు, జనవరి 30,బచ్చన్నపేట మండలం,జనగామ జిల్లా. తాము విద్య నేర్పుతున్న పాఠశాల విద్యార్థులకు శుద్ధమైన నీటిని అందించాలనే సంకల్పంతో నీటి శుద్ధి యంత్రము (వాటర్ ప్యూరిఫైయర్) మరియు ప్రింటర్లను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వారి భర్త కలిసి బహుకరించారు. బండ నాగారం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి హేమారాణి భర్త కొండల్ రెడ్డి ఇరువురు కలిసి దాదాపు 35000 ఖరీదు చేసే వాటర్ ప్యూరిఫైయర్ ప్రింటర్లను స్కూల్ కి బహుకరించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే సంకల్పంతోనే తాము బహుకరించామని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ కట్కూర్ ప్రధానోపాధ్యాయులు కే చంద్రశేఖర్ ఉపాధ్యాయ బృందం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఇజ్జగిరి బాలలక్ష్మి శ్రీనివాస్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. దాతలకు గ్రామస్తులు విద్యార్థులు తోటి ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు.