పయనించే సూర్యుడు ఆగస్టు 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలోని వివిధ పాఠశాలల్లో మనబడి మన భవిష్యత్తు ఫేజ్ 2 లో తూర్పుపల్లి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న తరగతిగదుల నిర్మాణాలతో ఉన్న మాముడూరు .చేజర్ల . ఆదూరుపల్లి ఉన్నత పాఠశాలలను సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుధీర్ బాబు బుధవారం తనిఖీ చేశారు. ఫేస్ టు కింద జరుగుతున్న పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.శిథిల స్థితిలో ఉన్న ఏటూరు ఎస్సీ పాఠశాల తరగతిగదిని పరిశీలించి నూతన తరగతి గదిని మంజూరు చేయడం జరుగుతుందని ఎ పి సి వెంకటసుబ్బయ్య తెలియజేశారు. ఈ సంవత్సరం ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయిన నూతక్కి వారి కండ్రిక పాఠశాలను సందర్శించి అదనపు తరగతి గదులకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. వీరి వెంట మండల ద్వితీయ విద్యాశాఖ అధికారి డిసి మస్తానయ్య పాల్గొన్నారు.