పయనించే సూర్యుడు గాంధారి 08/8/25
గాంధారి ఉన్నత పాఠశాలలో వృక్షబంధన్ కార్యక్రమం. రక్షాబంధన్ సందర్భంగా గాంధారి ఉన్నత పాఠశాలలో సమస్త జీవకోటి మనుగడకు ప్రాణాధారమైన వృక్షాల ప్రాముఖ్యతను చాటుతూ వృక్ష బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు పర్యావరణ హితమైన పదార్థాలతో రాఖీలను తయారుచేసి వాటిపై పర్యావరణ సంరక్షణ నినాదాలు ప్రదర్శించారునేను నీకు రక్షా, నువ్వు నాకు రక్షా, మనం ప్రకృతికి రక్ష అంటూ వృక్షాలకు రాఖీలు కట్టారు అడవులు భూమికి ఊపిరితిత్తులవంటివని వాటిని సంరక్షించినప్పుడే జీవులు మనుగడ సాగిస్తాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని జీవశాస్త్రం ఉపాధ్యాయులు శంకర్ గౌడ్ శరణ్య తెలిపారు. వృక్షబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యార్థులు సైన్స్ ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులు. రాజపండిత్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేష్ ,వనజ ,శ్రీదేవి, బాల్ రెడ్డి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు