
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 5( శర్మా ష్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రంలోని నంబర్ వన్ పాఠశాలలో శుక్రవారం సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా ఎస్బీఐ శాఖలో అకౌంట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రామలింగేశ్వర యాడికి విద్యార్థులకు 110 స్టీల్ ప్లేట్లు అందజేశారు.ఈ సందర్భం గా ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి మాట్లాడుతూ పాఠశాల లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. మధ్యా హ్న భోజన పథకంలో విద్యార్థులకు శుభ్రత,సౌకర్యం పెంపొం దించేందుకు స్టీల్ ప్లేట్ల పంపిణీ దోహదపడుతుందని తెలిపారు బ్యాంకు అధికారులు చూపిన సేవాభావాన్ని ఆయన అభినం దించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ సిబ్బంది మంజునాథ్, శేక్షావలి,పాఠశాల ఉపాధ్యాయులు నబి రసూల్ జయరాంరెడ్డి ప్రతిభ రాణి పాల్గొన్నారు.
