ఇలాంటి పాఠశాలలకు పర్మిషన్లు ఇచ్చినటువంటి ఎంఈఓ ను సస్పెండ్ చేయాలి.
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 18, కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్.ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు దోపిడిని అరికట్టాలని అదేవిధంగా పాఠశాలకు వత్తాసు పలుకుతున్న ఎమ్మిగనూరు ఎంఈఓ ను సస్పెండ్ చేయాలని కర్నూల్ డిఇఓ కి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు ఉదయ్, శేఖర్,ఆఫ్రిద్, ఖాజా,రఘునాథ్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు శ్రీరామ పాఠశాల, శారద విద్యానికేతన్,ముబారక్ పాఠశాల,నలంద విద్యాసంస్థలు,సరస్వతి విద్యానికేతన్, లిటిల్ ఫ్లవర్ ఈ పాఠశాలలే కాకుండా ఇంకా కొన్ని పాఠశాలలో 20, 30 సంవత్సరాల నుండి యాజమాన్యాలు నడుపుతున్న ఇప్పటికీ చాలా పాఠశాలలు సరైన మౌలిక వసతులు లేకపోవడం బాధాకరమని నిన్నటి రోజున కర్నూల్లో ఉన్నటువంటి కీర్తి పాఠశాలలో బిల్డింగ్ ఫిట్నెస్ లేక గోడకూలి ఒక విద్యార్థి మరణించడం మరియు పదిమంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది ఇవన్నీటికి అధికారులే వారి లంచాల కోసం కక్కుర్తి పడి సరైన పర్మిషన్లు లేకపోయినా ఉన్నట్టుగా అధికారులు సృష్టించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఎమ్మిగనూరులో ఉన్నట్టుంటే ప్రైవేట్ పాఠశాలల ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా వాళ్లు ఎందుకు సరైన వసతులు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు పాఠశాల యాజమాన్యాల తప్ప లేదంటే వీటిని సమర్థించే ఎంఈఓ తప్పని వారు ప్రశ్నించారు అదేవిధంగా విద్యార్థులకు ఏమి జరిగినా పర్వాలేదు మాకు మాత్రం వేలకు లక్షలు డబ్బులు కావాలని పాఠశాలల యాజమాన్యాలు ఇంత దారుణానికి ఒడి కడుతున్నారని వారు బాధను వ్యక్తం చేశారు ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి ఈ ప్రతి ఒక్క పాఠశాలపై విచారణ జరిపి మౌలిక వసతులు లేనటువంటి పాఠశాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో విద్యార్థి సంఘాలుగా మరిన్ని ఉద్యమాలు చేస్తాము అని వారు హెచ్చరించారు.