
రుద్రూర్, డిసెంబర్ 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో సోమవారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 158 జీవాలకు టీకాలు వేసినట్లు పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. కార్యక్రమంలో నూతన సర్పంచ్ నందిగాం సుమలత, ఉపసర్పంచ్ పట్లోల సురేష్, వార్డు సభ్యులు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.