
పయనించే సూర్యుడు జనవరి 21,నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
పారిశుద్ధ కార్మికులను తొలగిస్తే త్రీవ ఆందోళన తప్పదు-ఏఐటీయూసీ.
పాణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో దశాబ్దాలుగా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులపై రాజకీయ వేధింపులు తగదని వారిని తొలగించాలని చూస్తే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి రాజకీయ నాయకులను ఎత్తుకులను అడ్డుకట్ట వేస్తామని ఏఐటియుసి ఆధ్వర్యంలో పాణ్యంప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళన ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో. ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి మురళీధర్. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్ సీనియర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.సుశీలమ్మ డి.శ్రీనివాసులు పాల్గొని అనంతరం మాట్లాడుతూ,పాణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో దశాబ్దాల నుండి మహిళా కార్మికులు పారిశుద్ధ్య టాయిలెట్ తదితర పనులను నిర్వహిస్తూ ఆసుపత్రిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నారని కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది రాజకీయ నాయకులు తమ వారిని ఆసుపత్రిలో పనులకు పెట్టాలని ఉన్నవారి ఉద్యోగాలను ఊడగొట్టాలని చేస్తున్న ప్రయత్నాలను ఆపాలని లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పై నాయకులు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళ కార్మికులు. సుబద్ర. ప్రభావతి. వెంకట లక్షమ్మ. లలితమ్మ. నాగ లక్షమ్మ.తదితరులు పాల్గొన్నారు
