
పయనించు సూర్యుడు ఆగస్టు 4 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)ఐ పోలవరం మండలం పాతయింజరం గ్రామంలో వేంచేసియున్న గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లికి గ్రామ వికాస్ సంస్థ ఆధ్వర్యంలో ఆషాడం సారె సమర్పణ కార్యక్రమాన్ని గ్రామస్థులు మాతృమూర్తులు ఆడపడుచులుఘనంగా నిర్వహించారు .ముందుగా శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం నుండి సారెలతో గ్రామోత్సవంగా భగవన్నామ స్మరణతో బయలుదేరి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన విశేష పూజలు నిర్వహించి అమ్మవారి కి పూలు పండ్లు చలివిడి పానకాలు స్వీట్లు చీరా జాకెట్ గాజులు పసుపు కుంకుమ సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మ ప్రచారకులు బి కనకారావు పూజా కార్యక్రమాలు చేయించగా గ్రామ వికాస్ జిల్లా కార్యకర్త బి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ గ్రామంలో ఆలయ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు జరుపుకోవడం మరియు సత్సంగాలు జరుపుకోవడం ద్వారానే మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోగలమని హితవుపలికారు.ధార్మిక వేత్త డా,, రామకృష్ణారావు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పణలాంటి కార్యక్రమాల వలన హిందూ సంఘటన జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో డి వెంకటేశ్వరరావు కె శ్రీనివాసరావు బి వరలక్ష్మి బి గాయత్రి టి సుగుణ కుమారి పి సీతారామ వరప్రసాద్ సిహెచ్ వెంకట లక్ష్మీ పి హేమ ఓ శ్రీనివాస్ పాలెపు భవాణీ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.