పయనించే //సూర్యుడు న్యూస్// ఫిబ్రవరి6 మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని సోన్ బాయ్ స్ట్రీట్ లో గత 15 రోజులుగా పారిశుధ్యం పడకేసింది. మురికి కాలువలో చెత్త పేరుకుపోవడంతో పాటు 3-4 పందులు చనిపోయాయని, మునిసిపల్ సిబ్బందికి సమాచారం ఇచ్చినా రావడంలేదని, దీంతో దుర్వాసన భరించలేకపోతున్నామని, కనీసం ఇంటి తలుపులు తెరవలేక పోతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. మున్సిపల్ సిబ్బంది అదిగో వస్తున్నాం ఇదిగో వస్తున్నాం అంటున్నారు తప్పించి రావడం లేదని త్వరగా సమస్యను పరిష్కరించి దుర్వాసన నుంచి తమకు విముక్తి కలిగించాలని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.