
ముమ్మరంగా పారిశుధ్య పనులు
గార్ల ఒడ్డు సర్పంచ్ భూక్య నర్సి లాలు నాయక్
సిసి రోడ్డు పనుల నిర్మాణం చేపట్టడం జరిగింది
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 05 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు గ్రామంలోని మురుగు కాల్వల్లోని పూడిక మట్టి తీస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందిలు మరియు కూలీలు నూతన సర్పంచ్ భూక్య నర్సి లాలూ నాయక్ తమ గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని తొలగిస్తూ ముగురు కాల్వలను శూభ్రం చేస్తూ పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. ఎలాగైనా గార్లఒడ్డు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనులను వేగవంతంగా చేశారు.అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యం గా గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.ప్రస్తుతం చేపడుతున్న పనులు..గ్రామంలోని మురికి కాల్వల్లో, రోడ్లకు ఇరుపక్కల పేరుకుపోయి ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది మరియు కూలీలు శుభ్రపరిచారు ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి పలు సమస్యలు నెలకొన్నాయి.పదవి చేపట్టగానే వారికి అనేక సమస్యలు స్వాగతం పలికినప్పటికీ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. వీటితో పాటు గ్రామాల్లో మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండగా ప్రతి ఇంటికి నల్లా నీరు అందించే విధంగా కొత్త పైపులైన్లు వేయించి వేసవి కాలంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల మధ్యన ఉంటూ గ్రామ అభివృద్ధి పనులు చేస్తున్నసర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్ ను గ్రామస్తులు కొనియాడుతున్నారు.గ్రామాభివృద్ధే లక్ష్యంగ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నా, మురికి కాల్వల్లో పెరిగిన పిచ్చిమొక్కలను, పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని తొలగిస్తున్నాం. దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా ఉండేందుకు బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నాం. లీకైన పైపులైనను సరిచేసి కలుషితం లేని స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నాం. అని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివలంకి వెంకటేశ్వర్లు శెట్టిపల్లి నరేష్, భూక్యా లాలూ నాయక్ గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు