పయనించే సూర్యుడు తొర్రూర్, డివిజన్ ప్రతినిధి,(శ్రీరాo నవీన్).: తొర్రూరు పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పెద్దవంగర మండలంలోని, ఎల్బి తండా, బిసి తండా, చిన్నవంగర.”, గ్రామాల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి , మాట్లాడుతూ. పార్టీ బలోపేతం కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు..నాయకత్వం అంటే పదవులు కాదు, బాధ్యతలు అని గుర్తు చేస్తూ, ప్రతి కార్యకర్త పార్టీ కోసం పనిచేసే విధంగా సత్సంకల్పంతో ముందుకు వెళ్లాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అందరి సమస్యలను పార్టీ స్థాయి నుంచి ప్రభుత్వ స్థాయికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు..ఎమ్మెల్యే నాయకత్వంలో, ఇకపై ప్రతి కార్యకర్త నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలతో నిత్యం సన్నిహితంగా ఉంటూ, వారి సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా పార్టీపై నమ్మకాన్ని పెంచాలని అన్నారు. ప్రతి నాయకుడు పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేస్తే మాత్రమే విజయాలు సాధ్యమవుతాయి అని స్పష్టం చేశారు..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.....