అలసందగుత్తి ప్రభుత్వ భూమి కబ్జా నిందితులను కేసు పెట్టి జైలుకు పంపాలని యం. హెచ్. పి. యస్. తరపున డిమాండ్ చేస్తున్నాము.
పయనించే సూర్యుడు, జనవరి 1, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణఅలసందగుత్తి గ్రామంలో 30 సెంట్ల ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన భూకబ్జాదారుని పై ఆదోని మండల రెవెన్యూ అధికారులు కేసు పెట్టకుండా వదిలేయటాన్ని యమ్. హెచ్. పి. యస్. తీవ్రంగా ఖండిస్తున్నది.
ఆదోనిలో ప్రభుత్వ భూమిని కాపాడవలసిన అధికారులు అలసత్వం ప్రదర్శించటం శోచనీయం. పైగా ప్రభుత్వ స్థలంలో బండలు పాతిన వ్యక్తి బండలు తమంతట తామే తొలగించక పోతే రెవెన్యూ అధికారులే తొలగిస్తామని ప్రకటించటం హాస్యాస్పదం. అధికారుల ఇంట్లో ఏదైనా వస్తువు పోతే ఇలాగే నిందితులను వదిలేస్తారా? అని ప్రశ్నిస్తున్నాము.ఆదోని మండల రెవెన్యూ అధికారులు తప్పు చేసిన వారిని శిక్షించకపోగా వారిని తప్పించటానికి తిప్పలు పడుతున్నట్టుగా ఉంది. భూకబ్జాదారుల పై కేసు నమోదు చేయకపోతే రెవెన్యూ అధికారుల పై ప్రభుత్వానికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాము.
- ఎ. నూర్ అహ్మద్