పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1. పాల్వా టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి పాల్వంచ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ, మండలం పరిధిలోని పలు ప్రాంతాల్లో జరిగిన శుభ కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, డీ.సీ.ఏం.ఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. నవ భారత్ క్లబ్ లో మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ మనుమడు మోహనరాజ జైసాయి వివాహ వేడుకల్లో కొత్వాల పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు. కరకవాగు లో రైతు ఇంటూరి రామారావు కుమారుడు నవీన్ వివాహ రిసెప్షన్ లో కొత్వాల పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు. అయ్యప్ప నగర్ లో కాంట్రాక్టర్ పాకాల వెంకట్రావ్ నూతనంగా నిర్మించిన ఇంటికి గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం సందర్భంగా కొత్వాల పాల్గొని, వెంకట్రావ్ ను అభినందించారు.కోడిపుంజుల వాగు లో జర్పుల సెట్రామ్ కుమారుడు జెత్రామ్ వివాహ రిసెప్షన్ లో కొత్వాల పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో పలుపార్టీల నాయకులు, బంధువులు,తదితరులు పాల్గొన్నారు.