పయనించే సూర్యుడు జనవరి 10 ( పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డ నరహరి) పాల్వంచ టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్) పాల్వంచ నందు విశ్వ హిందీ దినోత్సవం శుక్ర వారం నాడు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి .పద్మ అధ్యక్షత వహించారు. హిందీ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ టి. అరుణకుమారి, హిందీ అధ్యాపకులు షెహనాజ్ ఖాన్ ఈ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు అయిన సభలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి .పద్మ మాట్లాడుతూ హిందీ భాష గొప్పతనం జాతీయ భాషగా గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషా భివృద్ధిని గురించి వర్ణించారు. ఈ సందర్భంగా హిందీ విభాగం అధ్యక్ష రాలు డాక్టర్ టి. అరుణకుమారి హిందీ భాష ప్రాముఖ్యత హిందీ భాష నేర్చుకోవడం వల్ల కలిగే ఉద్యోగ అవకాశాలను స వివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు హిందీ ఆవశ్యకత మరియు విశ్వ భాషగా హిందీ రూపాంతరం చెందిన వివరాలను తెలియజేశారు. హిందీ విద్యార్థులు అనూష మరియు పార్వతి హిందీ దేశభక్తి గీతానికి నృత్యం చేశారు. ఈ సదస్సులో అధ్యాపకులు అధ్యాప కేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సులో డి.రమేష్, డాక్టర్ కొండలరావు, డాక్టర్ స్వరూప రాణి, పారెల్లి శ్రీనివాస్, రాంబాబు, డాక్టర్ శ్రీదేవి, దీపిక, విమల, లీల సౌమ్య, కావ్య, పర్వీన్, రమేష్ , శ్రీనివాస్, పవన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.