
పయనించే సూర్యుడు డిసెంబర్ 1 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం1-12-2025 అన్నమయ్య జిల్లా
రాజంపేట నియోజక వర్గం సుండుపల్లి మండలం నందు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారాచంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని సుండుపల్లె తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు శ్రీ చప్పిడి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ చప్పిడి మహేష్ నాయుడుమరియు టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు ప్రజలు తమ నాయకుడికి అధ్యక్ష పదవి వరించడంతో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తారని నమ్మకంతో పాటు అభిమానం తో పెద్ద సంఖ్యలో నాయకులు కార్య కర్తలు ప్రజలు సుండుపల్లి మండలంలో ఉన్న పలు గ్రామాల్లో ఉదయం 6 గంటలకే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మొట్టమొదటిసారిగా సుండుపల్లె మండల అధ్యక్షపదవి బాధ్యతలు చేపట్టిన శ్రీ చప్పిడి రమేష్ నాయుడు సుండుపల్లి మరియు చిన్నంశెట్టిపల్లితిమ్మసముద్రం ,బాగంపల్లి ,ఎరమనేని పాలెం ,జి రెడ్డివారిపల్లి ,గుండ్లపల్లి గ్రామాల్లో పర్యటిస్తూ నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా పథకం పేద ప్రజలందరికీ ఒక సంజీవిని లాంటిది ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలని అని కోరారు ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నాయకులందరి సహకారంతో పంపిణీ చేపట్టడం శుభ పరిణామం అన్నారు*ఈ కార్య క్రమంలో పాల్గొన్న వారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ చప్పిడి మహేష్ నాయుడు మరియు తదితర గ్రామాలలో అధికారులతో కలిసి నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది