పయనించే సూర్యుడు ప్రతినిధి ఫిబ్రవరి 8 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం:- చివరి ఆయకట్టు వరకు ఉన్న రైతుకు నీరు అందేలా అందరూ రైతులు సహకరించాలని కోరడం జరుగుతుంది కుడికాలువ పైన కొన్నిచోట్ల రైతులు ప్రధాన కాలువకి అడ్డుకట్ట వేసి వారి తూముకు నీరు మళ్ళించడం జరుగుతుంది. కావున దిగువ ప్రాంతంలో ఉన్న రైతులకు నీరు సరిగ్గా చేరడం లేదు. రైతులందరికీ పంట సమృద్ధిగా చేతికి అందే విధంగా నీటిని పొదుపుగా వాడుకోవడానికి ప్రణాళిక రూపొందించడం జరిగినది. కావున రైతులు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వారి వారి పొలాలకు ఎంత నీరు అవసరమో అంత వాడుకొని తర్వాత వారే స్వయంగా తూమును మూసివేసి దిగువ ప్రాంతానికి నీరు వెళ్లే విధంగా చొరవ తీసుకోవాలని మనవి రైతులెవరైనా కాలువలో పారే నీటికి ఆటంకం కలిగిస్తే శాఖపరమైన కఠినమైన చర్యలు తీసుకోబడును. పించా ఆయకట్టు దారులైన రైతులకు మాత్రమే ప్రాజెక్టు నుండి నీటిని వ్యవసాయానికి వినియోగించే హక్కు గలదు . ప్రభుత్వం ఏర్పాటు చేసిన తూముల గుండా కాకుండా వేరే ఎటువంటి మార్గాల ద్వారా చౌర్యం చేసిన కఠినమైన చర్యలు తీసుకోబడును . అంటే , మోటార్ల ద్వారా నీటిని పంపిణీ చేయడం, అనుమతి లేని తూములో ఏర్పాటు చేసుకోవడం మొదలైనవి . ఈరోజు అక్కడక్కడ కొంతమంది ప్రధాన కాలువకు అడ్డువేసిన ఆటంకాలను తొలగించడం జరిగినది. ప్రస్తుతం పింఛ ప్రాజెక్టులో నీటి లభ్యత
నీరు 999.70 అడుగులు
కెపాసిటీ ఎం సి ఎఫ్ టి మరియు0.32181 TMC
అవుట్ ఫ్లో :
లిఫ్ట్ కెనాల్ = 20 క్యూసెక్కులు
రైట్ కెనాల్= 20 క్యూసెక్కులు
నేటి వినియోగం , నీటి లభ్యత, నీటి వలన కలిగే లాభనష్టాలు మరియు ఇతర విషయాల పైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగినది.