పిడిఎఫ్ బియ్యం పంపిణీ విషయంలో శ్రద్ధగా పనిచేస్తున్నా..
నా పై కక్షపూర్వతమైన ఆరోపణలు సరికావు..
పరువు నష్ట ధావా కైనా నేను సిద్ధం..కొండపాక డీలర్ దాట్ల వసంత..
పయనించే సూర్యడు, మే 12, కుమార్ యాదవ్, హుజురాబాద్ ఆర్ సి )
వీణవంక మండలం కొండపాక గ్రామంలో పిడిఎఫ్ బియ్యం 1 తారీఖు నుండి 15వ తారీకు వరకు ప్రతి నెల రెగ్యులర్గా గ్రామ ప్రజలకు అందిస్తున్న డీలర్ దాట్ల వసంత పత్రిక ప్రకటనలో తెలిపారు. ఇ సందర్బంగా వారు మాట్లాడుతూ..పక్కన ఉన్న గ్రామాలన్నీ, బియ్యం పంపిణీ చేసిన చేయకపోయినా , కొండపాక గ్రామంలో ప్రతిసారి అందుబాటులో ఉంటూ పిడిఎఫ్ బియ్యం అందజేసే కార్యక్రమంలో, కొండపాక గ్రామం ముందుంటుంది అన్నారు. 8 వా తేదీనాడు, పిడిఎఫ్ బియ్యం కొండపాకలో దిగుమతి అయిందని తెలియజేశారు, 8 నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు బియ్యం పంపిణీ చేశానని అన్నారు, అలాగే 10 నా మా బంధువుల పెళ్లి ఉన్నందున ఉండలేకపోతున్నా అని గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది అని చెప్పారు, నిన్నటి 10 వా తేదీ, మా సొంత కుటుంబంలో మా బంధువుల మ్యారేజ్ ఒకటి ఉంటే, ఆ మ్యారేజ్ కి వెళ్లి రావడం జరిగింది,అన్నారు. మళ్లీ మరుసటి ఆదివారం 11 నా పొద్దున నుండి సాయంత్రం వరకు పిడిఎఫ్ బియ్యం అందించడం జరిగింది, అని మాట్లాడారు. ఒంటరి మహిళను అని నన్నూ కొంతమంది కావలసుకొని, నామీద అసత్యపు ప్రచారాలు చేస్తూ, ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. పిడిఎఫ్ బియ్యం మాకున్న సర్క్యులర్ ప్రకారం పోయవలసిన తేదీల్లో పంపిణీ చేయడం మా బాధ్యతగా, ప్రతి నెల అందిస్తున్నాం,అని వివరించారు. మొత్తం పంపిణీ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మీడియా ద్వారా అని మాట్లాడారు.గతంలో గాని, ఇప్పుడు గాని ,ఎవరు ఎలాంటి ఇబ్బంది పడలేదని, కొంతమంది మాత్రమే నామీద కక్షపూరితమైన, విషపు అసత్యపు ఆరోపణలు చేయడం జరుగుతుంది అని ఇది సరికాదని, ఆవేదన తో తెలిపారు.నా మీద అసత్యపు ఆరోపణలు చేసిన వారిపై తగు చర్యలు తీసుకునే విధంగా, వారిపై పరువు నష్ట ధావా కైనా వెళ్తానని ఒక్క ప్రకటన లో డీలర్ వసంత తెలియజేశారు.