
{పయనించే సూర్యుడు} ఏప్రిల్ 15 నారాయణపేట
యువ మేధావి పిడిఎస్ యు స్థాపకులు కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయ సాధనకై పోరాడుదాం అన్ని పిడిఎస్ యు మాజీ జిల్లా అధ్యక్షుడు , రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ అన్నారు.నారాయణపేట జిల్లా కేంద్రంలో ,భగత్ సింగ్ నగర్ భగత్ సింగ్ భవన్ లో కామ్రేడ్ జార్జి రెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ లెజెండరీ లీడర్ ,యువ మేధావి ,హైద్రాబాద్ చే గువేరా అమరుడు జార్జిరెడ్డి తెలుగు నేలపై ,ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల హక్కుల కోసం ,సమానత్వ సమాజ స్థాపనకు జార్జిరెడ్డి చేసిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని ,నేటి క్యాంపస్లో కనిపిస్తున్న ప్రజాస్వామిక వాతావరణానికి ఆయన చేసిన త్యాగాలు ,పోరాటాలే ప్రధాన కారణమని తెలిపారు. గొప్ప విద్యార్థి నాయకుడిగా మాత్రమే కాకుండా ,న్యూక్లియర్ఫిజిక్స్లోగోల్డ్మెడలిస్ట్గా ,కిక్బాక్సింగ్లో ఛాంపియన్గా జార్జిరెడ్డి ప్రతిభను చాటుకుని ఉస్మానియా యూనివర్సిటీకి విశ్వవ్యాప్త కీర్తిని తీసుకువచ్చారని జార్జిరెడ్డి ని భౌతికంగా నిర్మూలిస్తే ప్రగతిశీల ఉద్యమం అస్తమిస్తుందని భావించిన ఆధిపత్య వర్గాల కుట్రలకు విరుద్ధంగా ,ఆయన మరణం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసిందని అన్నారు. నాడు జార్జిరెడ్డి ప్రారంభించిన ప్రగతిశీల ఉద్యమంలో నేడు లక్షలాది మంది యువత ,విద్యార్థులు జార్జిరెడ్డి స్పూర్తితో సమానత్వ సమాజ స్థాపన లక్ష్యంగా ప్రగతిశీల ఉద్యమ బాటలో ముందుకు సాగుతున్నారని తెలిపారు. కులమత సమానతలకు ,మూడవిశ్వాసాలకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి చూపిన పోరాట మార్గంలో నడుస్తూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతం, ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ ,విద్యార్థి హక్కుల సాధన కోసం విద్యార్థి , యువత ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు వెంకటేష్ , జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ ,జిల్లా సహాయ కార్యదర్శి రాజు, జిల్లా నాయకులు సురేష్ ,నందిని , నాయకులు నవనీత ,లక్ష్మి , నితిన్ ,విశాల్ ,అనిత ,చేరణ్ తేజ ,పావని ,కార్తీక్ ,నర్సింహా శృతి ,శివానీల తో పాటు తదితరులు పాల్గొన్నారు.
