సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ
పైనుంచి సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 22:-రిపోర్టర్ (కే శివ కృష్ణ )
బాపట్ల మండలం మూలపాలెం గ్రామంలో ఇటీవల అకాల వర్షానికి పిడుగులు పడి రెండు ఎకరాల వరికుప్ప దగ్ధమైన సంఘటన సింగరకొండ ను తీవ్రంగా కలిసివేసిందన్నారు. ఈ సందర్భంగా సోమవారం సింగరకొండ మూలపాలెం గ్రామం రేగులగడ్డ వినయ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి జరిగిన ఘటనపై ప్రభుత్వం నుండి సాయం అందిందా అని ఆరా తీశారు. వినయ్ కుమార్ సింగరకొండ తో మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఏ సాయం అందలేదని వీఆర్వో, ఏఇ వచ్చి వివరాలు రాసుకువెళ్లారని తెలియజేశారు. సింగరకొండ మాట్లాడుతూ కౌలు రైతు రేగుల గడ్డ వినయ్ కుమార్ వరికుప్ప దగ్ధమై వారం అవుతున్న అధికారులు ఆసరా కల్పించలేకపోయారని, కళ్ళ ముందు ఘోరం జరుగుతున్న అగ్నిమాపక కేంద్రం వాహనం అందుబాటులో లేకపోవడంతో వరికుప్ప పూర్తిగా బూడిద పాలు అయ్యిందని అన్నారు. జిల్లా కేంద్రంలో మరో ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు పిడుగు పడి వరి కుప్ప కాలింది దీనికి బీమా వర్తించదు అంటూ అధికారులు అంటున్నారు అని బాధితుడు సింగరకొండ వద్ద వాపోయారు. ఈ క్రాపు, కౌలు రైతు కార్డు, తదితర అంశాలతో ముడి పెట్టకుండా బాధితుడను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు సింగరకొండ.