
పయనించే సూర్యుడు మార్చి 16 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో తేజ స్కూల్ అని ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నడిపిస్తున్నారు ఆ విద్యాసంస్థలో ఒక విచిత్రమైన బోర్డును పెట్టి పిల్లల మనోభావాలు దెబ్బ తినేలాగా బోర్డును ఏర్పాటు చేశారు ఆ బోర్డు సారాంశం నాన్ వెజ్ స్కూల్ ఆవరణలోకి తీసుకురాకూడదని బోర్డు పెట్టారు ఆ బోర్డు పెట్టే అధికారం ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కి ఎవరు ఇచ్చారు పిల్లల మనోభావాలు దెబ్బ తినేలాగా స్కూలు నడిపించడం కరెక్టేనా అని అక్కడున్న ప్రజలు అందరూ అనుకుంటున్నారు కానీ ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి వివరణ అడగగా చాలా సిల్లీగా సమాధానం చెప్పారు ఆ సమాధానం ఏమనగా చేపలు తిని ముల్లులు ఇక్కడ వేస్తున్నారని అందుకని బోర్డు పెట్టామని సిల్లి సమాధానంతో కొట్టి పడేసారు ఇలాంటి స్కూళ్లు పైన విద్యా శాఖ అధికారులు స్పందించరా పిల్లల తిని ఆహారం కూడా ప్రిన్సిపాల్ నిర్ణయిస్తార ? ప్రిన్సిపాల్ ఏది తినమంటే అదే పిల్లలు తినాలా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ చట్టం?సూళ్లూరుపేట ఎంఈఓ దీనిపైన ఏం యాక్షన్ తీసుకుంటాడో వేచి చూడాలని అక్కడున్న ప్రజలు అనుకుంటున్నారు
